23, ఏప్రిల్ 2010, శుక్రవారం

రాజీకి రాజపథం


మార్పు సహజం... లేకుంటే నిలువ నీరే...

ఎంత సానుకూల ద్రుష్టి కోణం

నిన్నటి వన్నీ పాతవే

నేడు సరికొత్తగా అవతరించాలి

ఈ రోజు నీ చావు రేపటి పుట్టుకకు శ్రీకారం

ఒరేయ్ స్టుపిడ్ లేకుంటే చస్తావు

నీవు ఎలా వున్నావన్నదే ప్రధానం

మిగతాదంతా గాలికి ఒదిలేయ్ బ్రదర్

వేర్ సమ్ మాస్క్ ఆఫ్ సమ్ వన్ ఎల్స్

అది ఇప్పుడు ఎంత మాత్రమూ నేరము కారాదు

ఒరేయ్ ఇడియట్ నీ బతుకు కోరి చెపుతున్నా

సూత్రాల చొల్లు కబుర్లు కట్టిపెట్టు

నీవు చెప్పాలన్నా బతకాలని గుర్తుంచుకో

ఈ సమర్ధన అంతా రాజీలో భాగమే...

ఆగిపోకు సోదరా...

నేటి రాజీ రేపటి పోరాటానికి నాంది ఏమో?

8, ఫిబ్రవరి 2010, సోమవారం

చేతకానివాడిలా...నావల్ల కాదు

భారమైనా, బాధతోనైనా... మోజుకదా... 
నిన్నటి కలను పండించుకోవచ్చు కదా అని 
పరిగెత్తుకు వచ్చిన అంత సేపు లేదు 
నాటి సముద్రం కాదు ఇది 
నాటి పచ్చటి కొండలూ లేవు 
భీకరంగా గొంత్తెత్తి అరిచే సముద్రుడి కేకలు 
నేడు బేలగా అమ్మాయి గొంతులా... 
ఎవరినైనా అడ్డగించగలనన్న పొగరుతో 
నిలువెత్తుగా నిలబడే ఆ పర్వత సానువులు 
నేడు... చెరచబడ్డ అమ్మాయిల్లా తలవంచుకుని 
ఎర్రబడ్డ కళ్ళతో కన్నీరు కారుస్తున్నాయి 
ఇది చూడటానికా నేను ఇక్కడికి వచ్చింది 
కాదు... కానే కాదు... 
దీనిని భరించటం నావల్ల కాదు... 
మూగగా... మౌనంగా... చేతకానివాడిలా...