24, జులై 2018, మంగళవారం

అలసట

సంద్రాకాశాలు కలిసే సుందరలోకానికి
అనంతంగా ప్రయాణం...
అలుపొస్తోంది...
రెక్కలల్లాడుతున్నాయి
సౌందర్యాద్భుల వెంట
ఎండమావి ప్రయాణం
రాగ ప్రేమలూ అక్కడే
ఊహలనందుకోటానికి
అనంత వృథా పోరాటం
చేస్తూనే ఉండు... లేదంటే
జారిపోతావు...
అనంత నీశీధి శిథిల విశ్వంలోకి...

కామెంట్‌లు లేవు: