18, సెప్టెంబర్ 2018, మంగళవారం

పుట్టినరోజు

మమకారంతోనో, ప్రేమతోనో, ఇష్టంతోనో, కష్టమనుకున్నా తప్పనిసరి అయ్యో, చిరుద్వేషాన్ని మింగేస్తూ నిండిన పున్నమి వెన్నల వంటి హృది కాంక్షతోనో...
చిన్న విషయమేమీ కాదు...
50 సంవత్సరాలు...
మోసినందుకు, భరించినందుకు, తోడు నడిచినందుకూ, నడుస్తున్నందుకూ, నడిపిస్తున్నందుకూ...
ఇప్పటికైనా చెప్పకపోతే... ఓ అవకాశాన్ని కోల్పోతానేమోనన్న భయం. చెప్పే తీరాలి. ఆగ్రహాలు, ఆవేశాలు, అనుమానాలు, అపేక్షలు, అనురాగాలు, ఆనందాలు, సుఖాలు, దుఃఖాలు, కష్టాలు, కడగండ్లు, వేదనలు, రోదనలు, ఆరోగ్యాలు, అనారోగ్యాలు...
తోడైన, నీడగా నిలిచిన
రక్తబంధీకులు, బంధంతో జీవితకాల అనుబంధాలకు చోటిచ్చినోళ్లు, రేపటి మాటేమో కాని నేటి వరకూ పెద్దగా ఆలోచించిన చిన్నోళ్లూ, పదేళ్లు పెద్దోడిగా గౌరవమిస్తూ, చిన్నపిల్లోడిలా సాకిన సహోద్యోగులే అయినా, అంతకు మించి అనదగ్గోరికీ... అందరికీ... ఏమివ్వగలను? 
ప్రేమ పంచిన ప్రేమ వచ్చును...