31, డిసెంబర్ 2024, మంగళవారం

మరో ఏడాది...

పరిచయాలు పాతబడతాయి
కొత్త పరిచయాలు ఉత్సాహభరితంగా సాగుతాయి
నిన్నటి మాట మరుగున పడుతుంది
కొత్త వాగ్దానాలు ఆశలు రేపుతాయి
ఇదో చక్రం
స్థానం మారుతుంది
స్థలమూ మారుతుంది
ఆశకు చోటివ్వని
బుద్ధుడికి స్థానం లేదు
అందుకే గుడి



నిస్వార్థం నీడగా
స్వార్థం వెన్నంటే
అలౌకిక ఆనందం కాగితాల్లోనే…
అనురక్తితో రమించే
ఆసక్తి యాంత్రికమవుతుంది
జీవితం వందేభారత్ ప్రయాణంలా
అలుపే లేని అలసటతో
సాగుతూనే ఉంటుంది