27, జులై 2019, శనివారం

అప్పుడే ఏమైంది...

నిశ్చలంగా ఉందామనుకుంటానా...
బెడ్డ మాటున అలల సవ్వడి   
అరుణమై  సురుక్కు మందామనుకుంటానా...   
చీకటి మాటున వెన్నెల కిరణ స్పర్శ   
కారు రుతుమేఘమై వర్షిద్దామనుకుంటానా...   
ధృవ క్షేత్ర ఘనీఉత్పాతమై చుట్టేస్తావు 
అలౌకిక స్పర్శ... అంటిపెట్టుకొనే ఉందనుకుంటానా....   
అధిభౌతికమంటూ గోడకట్టేస్తావు   
ఉన్నదని చూపించలేని మనస్సుకీ 
లబ్బుడబ్బుంటూ ఉనికిని చాటే హృదయానికీ 
 లంకె వేయాలనుకున్న ప్రతిసారీ...   
ఈతరాకున్నా వరదగోదారి దాటే యత్నమే   
అప్పుడే ఏమైంది... పుట్టింది ఇప్పుడేగా...
హృదయ నేస్తానికి... చెలికి...
జన్మదిన శుభాకాంక్షలు
- సత్యారుణ
27.07.2019

1 కామెంట్‌:

Anil Atluri చెప్పారు...

చెలి అనగానే ఏవిటో కవిత్వం పొంగుకొస్తుంది నీకు. చి న
సరే, నా తరఫున కూడా నీ చెలికి
పుట్టిన రోజు మేలుతలపులు
అందజేయి.